ఆ నటి మాజీ భర్తతో హీరోయిన్ ప్రేమాయణం.. బ్రేకప్‌తో అన్నీ బట్టబయలు..

by Disha Web Desk 7 |
ఆ నటి మాజీ భర్తతో హీరోయిన్ ప్రేమాయణం.. బ్రేకప్‌తో అన్నీ బట్టబయలు..
X

దిశ, సినిమా : శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి బిగ్ బాస్‌లో రాకేష్ బాపట్‌తో నడిపిన ప్రేమాయణం గురించి తెలిసిందే. బయటకు వచ్చాక కూడా వీరిద్దరి లవ్ జర్నీ కంటిన్యూ కాగా కొద్ది కాలానికే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇందుకు కారణం రాకేష్ మాజీ భార్య, పాపులర్ టీవీ యాక్ట్రెస్ రిధి డోగ్రా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన ప్రమేయమేమీ లేదని, ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేయొద్దని క్లారిటీ ఇచ్చింది రిధి. 'అభిమానులు SaRa(Shamitha-Rakesh)లను ఎంతగా అభిమానిస్తున్నారో నాకు తెలుసు. కానీ వారిద్దరు విడిపోయేందుకు నేనే కారణమని విమర్శించవద్దు. ఇప్పటిటీ రాకేష్ నా ఫ్రెండ్‌గా కొనసాగుతున్నాడు. అలాగని స్నేహితుల పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుంటానని అనుకోవద్దు' అని వివరించింది. కాగా రిధితో డివోర్స్ తర్వాత రాకేష్ చాలా బాధపడ్డాడు. తాను రాంగ్ డెసిషన్ తీసుకున్నానని మీడియా ముందే ఓపెన్‌గా చెప్పాడు కూడా.

Next Story

Most Viewed