వందేండ్ల కిందటి చీర కట్టిన రియా.. ఆ కొంటె చూపులకు కుర్రాళ్లు ఫిదా

by Disha Web Desk 7 |
వందేండ్ల కిందటి చీర కట్టిన రియా.. ఆ కొంటె చూపులకు కుర్రాళ్లు ఫిదా
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ట్రెడిష‌న‌ల్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. ద‌స‌రా న‌వ‌రాత్రుల సందర్భంగా నటీమణులంతా స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ ట్రీట్ ఇస్తూ అలరించిన సంగతి తెలిసిందే. కాగా విజ‌య‌ద‌శ‌మి రోజు వందేండ్ల కింద‌టి తన అమ్మమ్మ శారీ కట్టుకుని వింటేజ్ లుక్‌తో మైమరపించింది రియా. ఇక ఈ వేషాధారణలోనే మిర్రర్ సెల్ఫీలు తీసుకున్న ఆమె తన అవుట్‌ఫిట్ ఫొటోల‌ను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘శుభ విజ‌య‌ద‌శ‌మి. ఇది మా అమ్మమ్మ చీర. వందేండ్ల నాటిది. నా పూర్వీకులకు సంబంధించిన‌వి నాకు ఎంతో ప్రత్యేకమైనవి’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా రియా అందాలను తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed