హనుమాన్ కు థియేటర్ లో సీటుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 1 |
హనుమాన్ కు థియేటర్ లో సీటుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదాలకు కేంద్ర బిందువు ఆర్జీవీ.. ఆయన ఏం మాట్లాడినా ఓ సంచలనమే. అయితే, తాజాగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక సీటును హనుమంతుడికి కేటాయించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాకు ఫ్రీ టికెట్లు ఇవ్వడంతో తమకు కూడా పాపులారిటీ వస్తుందనేది ఓ పిచ్చి నమ్మకమని చెప్పుకొచ్చాడు. అయినా.. హనుమంతుడికి థియేటర్లలో ఒక సీటు కేటాయించడం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇది దేవుడిని అవమానించినట్లే అవుతుందని, హనుమంతుడికి సీటు కేటాయించాల్సిన అవసరమే లేదంటూ ఆర్జీవీ కొట్టి పాడేశారు.

ఇవి కూడా చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)

Next Story

Most Viewed