ఆయనను ట్రోల్స్ ఏం చేయలేవు.. వందరేట్ల వేగంతో పుంజుకుంటాడంటూ నిర్మాతపై ఆర్జీవీ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-22 07:09:28  IST  )

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) చివరగా ‘శారీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది.

ఆయనను ట్రోల్స్ ఏం చేయలేవు.. వందరేట్ల వేగంతో పుంజుకుంటాడంటూ నిర్మాతపై ఆర్జీవీ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) చివరగా ‘శారీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన వర్మ మనోజ్ బాజ్‌పాయ్‌తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, నిర్మాత నాగవంశీ(Nagavamshi)పై ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ గత కొద్ది కాలంగా ట్రోలింగ్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. కింగ్‌డమ్, వార్-2 వల్ల నష్టాలు వచ్చినట్లు వార్తలు రావడంతో అంతా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన స్పందించారు. ‘‘ఏంటి నన్ను చాలా మిస్ అవుతునట్టు ఉన్నారు. వంశీ ఆది, వంశీ ఇది అని గ్రిప్పింగ్ కథనాలు తో ఫుల్ హడావిడి నడుస్తుంది… పర్లేదు, ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్నందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి. కానీ ఇంకా ఆ సమయం రాలేదు… కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంటాను. మాస్ జాతరతో అతి త్వరలో మీ అందరినీ కలుస్తానంటూ’’ ట్రోలర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ పోస్ట్‌పై ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. ‘‘నాగవంశీ ఒక దయగల నిర్మాత. ఆయనను ట్రోల్స్ ఎప్పటికీ కూడా కిందకు లాగలేవు. 10రేట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’’ అని రాసుకొచ్చారు.

లింక్

Next Story