ఆ కేటగిరీ వాళ్లకు మాత్రమే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

by Disha Web Desk 10 |
ఆ కేటగిరీ వాళ్లకు మాత్రమే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : ఆర్జీవీ ఏ విషయం చెప్పినా.. కొత్తదనమో, చెత్తదనమో ఉంటుందని అంటుంటారు నెటిజన్లు. పైగా ఈ ట్వీట్ చూస్తే నిజమే అనిపిస్తుందంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న క్రమంలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు వర్మ. కానీ ఈ విషెస్ దేశ ప్రజలందరి కోసం కాదు. జస్ట్ విడాకులు తీసుకున్న జంటలకు మాత్రమే చెప్పాడు. వారు మాత్రమే పార్ట్‌నర్స్ నుంచి విడిపోయి ఫ్రీడమ్ పొందారని.. అందుకే డైవోర్స్‌డ్ కపుల్స్‌కు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘ఈ దేశంలో స్వతంత్రాన్ని వాడుకుంటుంది నువ్వు ఒక్కడివే ఆర్జీవీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed