- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘షో మ్యాన్’గా రాబోతున్న ఆర్జీవీ.. షాకింగ్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
నిజ జీవితంలో ‘షో మ్యాన్’ అయిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘షో మ్యాన్’(Showman).

దిశ, సినిమా: నిజ జీవితంలో ‘షో మ్యాన్’ అయిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘షో మ్యాన్’(Showman). ఈ మూవీ ‘మ్యాడ్ మాన్స్టర్’ ట్యాగ్ లైన్ రాబోతుంది. ప్రముఖ నటుడు సుమన్ (Suman)ఇందులో విలన్‌గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్‌గా నటించిన రజినీకాంత్ చిత్రం ‘శివాజీ’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ‘నూతన్’ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఆర్జీవీతో ఇంతకుముందు ‘ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2 చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి... భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. రాంగోపాల్ వర్మ హీరోగా... సుమన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






