ఆ అమ్మాయిపై మనసు పడ్డ ఆర్జీవీ.. ఆమె గురించి సోషల్ మీడియాలో ఎంక్వైరీ.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
ఆ అమ్మాయిపై మనసు పడ్డ ఆర్జీవీ.. ఆమె గురించి సోషల్ మీడియాలో ఎంక్వైరీ.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో ఒక దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు.

తాజాగా, ఆర్టీవీ తన ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశారు. మెడలో కెమెరాతో ఫొటో తీస్తున్న ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా ‘‘ఆమె ఎవరో ఎవరైనా చెప్పగలరా?’’ అని క్యాప్షన్ జత చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు కొంపతీసి ఆమెపై మనసు పారేసుకున్నావా అందుకే ఆమె గురించి అడుగుతున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది ఆమె చాలా అందంగా ఉందని ఆమె పేరు శ్రీలక్ష్మి సతీష్ అని ఆమె సోషల్ మీడియా ఐడీని కూడా షేర్ చేశాడు.



Next Story

Most Viewed