‘రెట్టతల’ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించి షాకిచ్చిన అరుణ్ విజయ్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) ఓ వైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ కనిపిస్తున్నారు.

‘రెట్టతల’ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించి షాకిచ్చిన అరుణ్ విజయ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) ఓ వైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన ‘ఇడ్లీ కడై’ సూపర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అందరి దృష్టి అరుణ్ విజయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. ప్రస్తుతం అరుణ్ విజయ్ భారీ యాక్షన్-థ్రిల్లర్ సినిమా ‘రెట్టతల’(RettaThala )తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తిరుకుమారన్ (Thirukumaran)దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ విజయ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆయనతో కలిసి సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటిస్తుండగా, తాన్యా రవిచంద్రన్, యోగేష్, జాన్ విజయ్, హరీష్ పెరాది, బాలజీ మురుగదోస్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

బాబీ బాలచంద్రన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 18 విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు వార్తలు వస్తు్న్నాయి. ఈక్రమంలో.. తాజాగా, అరుణ్ విజయ్ ట్విట్టర్ ద్వారా ‘రెట్టతల’ విడుదల వాయిదాపై స్పందించాడు. డిసెంబర్ 25, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేయబోతుందని కూడా వెల్లడించాడు. అలాగే ఒక చేతిలో గన్ పట్టుకుని ఉండగా.. మరో చేతిలో డైరీ, ఎర్రగులాబి పువ్వుతో నిల్చున్న పోస్టర్‌ను షేర్ చేశాడు.

ఇక ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఒక పాత్రలో విలన్‌గా, మరోపాత్రలో ప్రేమికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సామ్ సి. ఎస్. సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా డిసెంబర్ బరిలోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. క్రిస్మస్ కానుకగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అఖండ-2, డెకాయిట్, శంబాల, ఫంకీ, ఛాంపియన్ వంటి సినిమాలతో ‘రెట్టతల’ పోటీపడనుంది. వీటన్నింటినీ దాటుకుని ఈ మూవీ హిట్ అందుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

link

Next Story