Renu Desai: తోడు కావాలంటూ రేణు దేశాయ్ పోస్ట్.. అందుకోసమేనా?

by Disha Web Desk 7 |
Renu Desai: తోడు కావాలంటూ రేణు దేశాయ్ పోస్ట్.. అందుకోసమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ 2013లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ, పిల్లల కోసం వారు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో పలు ఇంటర్వ్యూలో తోడు అవసరం అని తెలిపింది రేణు దేశాయ్. దీంతో ఆమె రెండోపెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2018 ఓ వ్యక్తితో ఆమెకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

కాగా.. రేణు దేశాయ్ రెండో పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా రేణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ''జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'' అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. అంతే కాకుండా మరో పోస్ట్‌లో ''మీ సోల్ మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'' అంటూ కామెంట్ పెట్టింది. చాలా రోజుల తర్వాత ఆమె ఇలాంటి పోస్ట్‌లు పెట్టడంతో మరో సారి రెండో పెళ్లి వార్తా పట్టాలెక్కింది. మరి రేణు నిజంగానే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో ఉందేమో తెలియాల్సి ఉంది.

Also Read : Yami Gautam: బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన యంగ్ బేబి.. అమ్మ చెప్పిందే చేస్తానంటూ

Next Story

Most Viewed