అక్షయ్ కుమార్-అనీస్ బజ్మీ కామెడీ ఎంటర్‌టైనర్ విడుదల తేదీ ఫిక్స్

by Mallepaka Hamsa |

ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026, డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించారు.

అక్షయ్ కుమార్-అనీస్ బజ్మీ కామెడీ ఎంటర్‌టైనర్ విడుదల తేదీ ఫిక్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనీస్ బజ్మీల క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి వచ్చింది. పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబో రిపీట్ అవడం విశేషం. ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌తో చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలుస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో విద్యాబాలన్, రాశీ ఖన్నా, విజయ్ రాజ్, సుదేశ్ లెహ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాకుండా కేరళలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా.. త్వరలోనే అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ లుక్‌ను విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ రెడ్డి, కుల్దీప్ రాథోడ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజుకు ఇది 60వ నిర్మాణ చిత్రం కావడం విశేషం. యాక్షన్ సినిమాల మధ్య కుటుంబమంతా కలిసి చూసే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్. తాజాగా, ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026, డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించారు.

Next Story