- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో ఇల్లాలు.. బయట ప్రియురాలు.. సూపర్ స్టార్ రొమాంటిక్ వీడియోలు వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గన్.. హీరోయిన్ కాజోల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ బయటకు వచ్చినప్పుడు అన్యోన్యంగానే కనిపిస్తారు. కానీ కాజోల్ మాత్రం అప్పుడప్పుడు సీరియస్ లుక్స్ ఇచ్చి దొరికిపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ హీరోకు..

దిశ, వెబ్‌సైట్ : బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గన్.. హీరోయిన్ కాజోల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ బయటకు వచ్చినప్పుడు అన్యోన్యంగానే కనిపిస్తారు. కానీ కాజోల్ మాత్రం అప్పుడప్పుడు సీరియస్ లుక్స్ ఇచ్చి దొరికిపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ హీరోకు.. మరో హీరోయిన్ టబుకు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే టాక్ నడుస్తుంది. అందుకే ఆయన సినిమాల్లో దాదాపు ఆమె ఉంటుందనే గుసగుసలు వినిపిస్తాయి. ప్రమోషన్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా అలాగే ఉంటుంది. మీద చేయి వేసుకోవడాలు, గుసగుసలు, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తుండటంతో గాసిప్స్ స్ట్రాంగ్ అయిపోయాయి.
అయితే కాజోల్ సీరియస్ లుక్స్.. టబు ముద్దుల సీన్స్.. కలిపి ఓ వీడియో చేసిన బాలీవుడ్ రివ్యూయర్ కేఆర్‌కే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంట్లో ఇల్లాలు.. బయట ప్రియురాలు.. ఉన్నప్పుడు.. ఒక వ్యక్తి ఎంత సంతోషంగా, టెన్షన్‌గా ఉంటాడో ఈ క్లిపింగ్ చూస్తే అర్థమవుతుందంటూ షేర్ చేశాడు. స్టోరీ బాగుంది కానీ ఇది నిజం కాదని కొందరు అంటుంటే.. టబు, అజయ్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అని.. వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ను ఇలా చూడటం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. కానీ వీడియో మాత్రం రొమాంటిక్‌గా ఉందంటున్నారు ఇంకొందరు.






