బార్బీ గర్ల్ గా సినీనటి రేఖ... అందానికి దాసోహం అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 1 |
బార్బీ గర్ల్ గా సినీనటి రేఖ... అందానికి దాసోహం అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటి రేఖ.. 1980-1990 దశకాల్లో యువతను ఉర్రూతలూగించిన కలల రాణి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆమె సౌందర్యానికి ఫిదా అయ్యాడంటే అంతటి సౌందర్యం అమె సొంతం. తాజాగా, 'వోగ్ అరేబియా' అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నటి రేఖతో వారు ఫోటోషూట్ కు ఒప్పదం కుదుర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు జూలై 3న ఆవిష్కరించబడ్డాయి. అందులో రేఖ ధరించిన దుస్తులను ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించాడు. ఈ క్రమంలోనే మ్యాగజైన్ కు సంబంధించిన రేఖ ఫొటోలను ఈ-షాపింగ్ ప్లాట్ ఫాం మైంత్రా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. ' రేఖను బార్బీగా మళ్లీ ఊహించుకొమ్మని మేము AIని కోరాం' క్యాప్షన్ చదవండి అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో రేఖను బార్బీగా చూసిన కొందరు నెటిజన్లు అందానికి దాసోహం అవుతున్నారు.



Next Story

Most Viewed