అక్షయ్, షారుఖ్, అమీర్ తిరస్కరించిన ఈ చిత్రం... నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది..

by Bhoopathi Nagaiah |

బ్లాక్ బస్టర్ కంటెంటే కానీ ఒక్కోసారి వర్కౌట్ అవదేమో అనిపిస్తుంది. అందుకే హీరోలు ప్రాజెక్ట్‌లను రిజెక్ట్ చేస్తుంటారు. ఇంకొందరు డేట్స్ కుదరక కూడా నో చెప్పేస్తుంటారు.

అక్షయ్, షారుఖ్, అమీర్ తిరస్కరించిన ఈ చిత్రం... నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది..
X

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ కంటెంటే కానీ ఒక్కోసారి వర్కౌట్ అవదేమో అనిపిస్తుంది. అందుకే హీరోలు ప్రాజెక్ట్‌లను రిజెక్ట్ చేస్తుంటారు. ఇంకొందరు డేట్స్ కుదరక కూడా నో చెప్పేస్తుంటారు. కానీ అదే స్టోరీతో మరో హీరో హిట్ కొడితే బాధపడిపోతుంటారు. ఇలాంటిదే ఈ బాలీవుడ్ సినిమా. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తిరస్కరించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాదు ఏకంగా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది. 1999లో విడుదలైన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఈ ఘనత సాధించగా.. నేటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా బడ్జెట్ రూ.16 కోట్లు మాత్రమే కాగా బాక్సాఫీస్ వద్ద రూ. 52 కోట్లు వసూల్ చేసింది.

ఈ మూవీలో ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ నటించారు. అయితే ముందుగా ఐశ్వర్య భర్త క్యారెక్టర్‌ అమీర్, షారుఖ్, అక్షయ్, సంజయ్ దత్, అనిల్ కపూర్‌కు ఆఫర్ చేశారట. కానీ ఆ నటీనటులందరూ వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. చివరకు అజయ్ దేవగన్‌ని సంప్రదించగా.. ఓకే చేశాడు. కాగా ఇంత మంది నటులచే తిరస్కరించబడిన ఈ చిత్రం ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో నాలుగు నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నింబుడా నింబుడా’, ‘తడప్ తడప్’, ‘ఢోలీ తారో ఢోల్ బాజే’ సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.

Next Story