బాబు మోహన్ క్లాప్‌తో శ్రీకారం చుట్టుకున్న రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్!

by Disha Web Desk 7 |
బాబు మోహన్ క్లాప్‌తో శ్రీకారం చుట్టుకున్న రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్!
X

దిశ, సినిమా : రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. సంస్థను నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు నిర్వాహకులు. ఈ మేరకు సోమవారం రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు. ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న ‘సోషల్ వర్కర్స్’కు ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మహేందర్ రెడ్డి దర్శకుడిగా మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న రెండో మూవీ ‘కోబలి’.

ఇక మూడో సినిమా ‘హ్యాపీ ఉమెన్స్ డే’. కాగా ఈ సినిమాల పూజా కార్యక్రమాలకు బాబు మోహన్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు అతిథులుగా హాజరయ్యారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత విజయ్ రెడ్డి ప్రతిభ ఉన్న కళాకారుల కలలను సాకారం చేయడం కోసం ఈ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించినట్లు తెలిపారు.

Also Read..

‘విరూపాక్ష’ కాలర్ ఎగిరేసేలా ఉంటుంది: సాయిధరమ్ తేజ్



Next Story

Most Viewed