పవన్ కల్యాణ్ BRO సినిమా చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ (వీడియో)

by Dishanational2 |
పవన్ కల్యాణ్ BRO సినిమా చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ (వీడియో)
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అందుకు తగ్గట్లుగానే వీకెండ్‌లో సత్తా చాటింది. కానీ తర్వాత డీల పడిపోయింది. 5వ రోజు మంగళవారం వసూళ్లు మరింత డౌన్ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం రూ.1.60-1.70 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1.90-2.00 కోట్లు షేర్‌ను రాబట్టినట్లు తెలిస్తోంది. ఇలా ఐదు రోజుల్లోనే రూ.61 కోట్ల వరకు వసూల్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగా హీరోలు మాత్రం ఇంకా మూవీని చూడనట్లే తెలుస్తుంది.

Read More: Pranitha Subhash : కంటిచూపుతో మైమరపిస్తోన్నప్రణీత సుభాష్

Next Story

Most Viewed