‘మాస్ జాతర’ సినిమా రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-01 07:30:38  IST  )

మాస్ మహారాజా చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

‘మాస్ జాతర’ సినిమా రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: మాస్ మహారాజా చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. నేరాలు జరగకుండా చూసుకోవడంతో పాటు జనాలు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. ‘మాస్ జాతర’ (mass jathara) టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదలైంది. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. ఎనర్జీ లుక్, ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక రోటీన్ కమర్షియల్ స్టోరీ అయినప్పటికీ బాగానే మెప్పిస్తోంది.

కథ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు రవితేజ. కానీ ఆ గ్రామం విలన్ నవీన్ చంద్ర కంట్రోల్‌లో ఉంటుంది. అక్కడ ఆయన ఏం చెబితే అది వేదం అన్నట్లుగా జనాలు తలాడిస్తారు. గంజాయి పండించి.. కోల్‌కత్తాకు సరఫరా చేయడం చేస్తుంటాడు. అయితే రవితేజ ఆ వ్యాపారాన్ని నడిపించకుండా.. అడ్డుతిరుగుతాడు. నవీన్ చంద్రకు పోలీసులతో పాటు రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. రవితేజకు మాత్రం కేవలం రైల్వే స్టేషన్ పరిధిలోనే కొందరు మాత్రమే సపోర్ట్‌గా ఉంటారు. అసలు రవితేజ విలన్‌ను ఎలా అడ్డుకుంటాడు? దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. రాజేంద్ర ప్రసాద్ యాక్షన్స్ సీన్స్, సాంగ్స్, శ్రీలీల (Sreeleela)డాన్స్ స్టెప్స్ కొంతమేర ‘మాస్ జాతర’కు ప్లస్ అయ్యాయి.

Next Story