- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులతో కలిసి ‘టైగర్ నాగేశ్వరరావు’ చూసిన Ravi Teja పిల్లలు.. వీడియో వైరల్
రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది

దిశ, సినిమా: రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ మూవీ మేనియా కొనసాగుతోంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నడుస్తుండగా రవితేజ ఫ్యామిలీ మెంబర్స్ టైగర్ నాగేశ్వర రావు ఫీవర్‌లో మునిగితేలుతున్నారు. ఈ మేరకు రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో స్నేహితులతో కలిసి సినిమా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వంశీ దర్శకత్వం వహించిన చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించగా.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణూ దేశాయ్, అనుకృతి వ్యాస్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో మెప్పించగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అభిమానులను అలరిస్తోంది.
ఇవి కూడా చదవండి : కూతురినే హీరోయిన్‌గా పెట్టుకుంటున్న స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్






