దర్శకుడిగా మారిన రవి మోహన్.. మొదటి సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-16 13:22:41  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(Ravi Mohan) ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

దర్శకుడిగా మారిన రవి మోహన్.. మొదటి సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(Ravi Mohan) ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఓ వైపు వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న రవి మోహన్ ఇటీవల తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్‌పై రాబోతున్న మొదటి రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా అనౌన్స్ చేశారు. తాజాగా, రవి మోహన్ తన మొదటి సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ (An Ordinary Man)ప్రోమోను షేర్ చేశారు. ఇక ఇందులో యోగిబాబు కామన్ మ్యాన్‌గా కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘నా తొలి దర్శకత్వం వహించిన చిత్రం నుంచి యోగి బాబు(Yogi Babu) ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ ప్రోమోను ఎంజాయ్ చేయండి. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ మూవీని రవి మోహన్ తెరకెక్కించడంతో పాటు నిర్మిస్తున్నారు.

Next Story