ఘనంగా ప్రారంభమైన రష్మిక పాన్ ఇండియా మూవీ..నేషనల్ క్రష్ సంప్రదాయ లుక్‌‌కు నెటిజన్లు ఫిదా

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-27 09:42:47  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్లు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.

ఘనంగా ప్రారంభమైన రష్మిక పాన్ ఇండియా మూవీ..నేషనల్ క్రష్ సంప్రదాయ లుక్‌‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్లు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఇటీవల నేషనల్ క్రష్ పుష్ప-2, ఛావా, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, థామా వంటి చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈక్రమంలోనే నేషనల్ క్రష్ ఓ పాన్ ఇండియా సినిమాను ప్రకటించింది. ‘మైసా’(mysaa) పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని రవీంద్ర పూలే(Ravindra Phule) తెరకెక్కిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ‌కథతో రాబోతుండగా.. ఇందులో రష్మిక యోధురాలిగా కనిపించనుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మైసా’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi), నిర్మాత సురేష్ బాబు గెస్టులుగా హాజరయ్యారు. వీరిద్దరిలో సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించాడు. ఇక ఇందులో రష్మిక బ్లూ కలర్ చీర కట్టుకుని కుంకుమ బొట్టుతో సంప్రదాయ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు అమ్మడు అందానికి ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘మైసా’ చిత్రం ఏకంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

link

Next Story