- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త జర్నీ స్టార్ట్ చేయడం చాలా ఉత్సాహంగా ఉందంటూ రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్‌ను తన ఖాతాలే వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్‌ను తన ఖాతాలే వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్, పుష్ప-2, ఛావా, కుబేర వంటి చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేసిన ఈ భామ తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో టాలెంటెడ్ హీరో దీక్షిత్ రెడ్డి(Dixit Reddy) సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో దీనిని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, నేషనల్ క్రష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. కొత్తప్రయణం మొదలు పెట్టిన రష్మిక ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ అమ్మడు కొత్త బిజినెస్ట్ స్టార్ట్ చేసింది. ‘డియర్ డైరీ’ పేరుతో ఓ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘ఇది నిజంగా నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది.
ఇది కేవలం బ్రాండ్ కాదు.. పెర్ఫ్యూమ్ మాత్రమే కాదు.. ఇది నాలో ఒక భాగం. సువాసన ఎల్లప్పుడూ నా వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఈ రోజు నేను దానిని మీతో పంచుకుంటాను.. నేను దీన్ని చేయగలిగినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను కానీ చాలా భయపడ్డాను. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయని ఆశిస్తున్నాను.. మీరు కూడా దీన్ని నాలాగే ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






