- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రష్మిక.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'సీతారామం'.

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'సీతారామం'. ఈ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 5న థియేటర్లలో రిలీజ్ అయిన 'సీతారామం'.. ఇక ఓటీటీలో అలరించేందుకు ముస్తాబవుతుంది. ఈ క్రమంలోనే సీతారామం సినిమా నుంచి డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో రష్మిక మందన్న పాకిస్థానీ కావడంతో.. సీత, రామ్‌ను కలిపేందుకు ఇండియా వస్తుంది. సీత కోసం నూర్జహాన్ కాలేజ్‌కు వెళుతుంది. అక్కడ సీత గురించి తెలుసుకుని బయటకు రాగానే క్యాబ్ డ్రైవర్‌తో ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇండియాలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని రష్మిక కోపంగా అంటుంది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ ఇలాంటి వాళ్లే ఉంటారు మేడం. ఈ బ్యాగ్ కోసం మా ఇండియా పరువు మీకు ఇచ్చి పంపించలేము కదా అని అంటాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిని చూసిన నెటిజన్స్ ఈ సీన్ సినిమాలో ఉండింటే రష్మిక నిజంగా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చదని అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అంతకుముందు వేశ్యగా చేశా.. పోర్న్ ఇండస్ట్రీ గురించి స్టార్ యాక్ట్రెస్






