చెత్తకుప్పలో గంటల తరబడి ‘కుబేర’ షూటింగ్ జరుగుతుండగా రష్మిక అలా అనేసింది.. ధనుష్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-11 14:15:17  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున (Nagarjuna)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera).

చెత్తకుప్పలో గంటల తరబడి ‘కుబేర’ షూటింగ్ జరుగుతుండగా రష్మిక అలా అనేసింది.. ధనుష్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున (Nagarjuna)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అమిగోస్ క్రియేషన్స్‌లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో జిమ్ సర్బ్, దలీప్ తహిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తాజాగా, ముంబైలో ఓ సాంగ్ లాంచ్ నిర్వహించారు.

ఇక ఇందులో పాల్గొన్న ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్. షూటింగ్ సమయంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నేను బెగ్గర్‌గా నటించాను. అయితే సవాలుతో కూడిన ఈ ప్రయాణాన్ని ఆస్వాదించా. శేఖర్ కమ్ముల అందరితోనూ స్వేహపూర్వకంగా ఉంటారు. ఆయన 20 నిమిషాల్లో ఈ చిత్రం స్క్రిప్ట్ వినిపించారు. ఇక ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు నేను రష్మిక షూటింగ్‌లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. పరిస్థితి ఏంటని అడగ్గా.. నాకేం వాసన రావట్లేదు అనేసరికి నేను షాక్ అయ్యాను. మరి ఆమెకు ఏమైందో తెలియదు. షూటింగ్ సమయంలో ఎన్నో జ్ఞాపకాలు పంచింది కుబేర’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story