గుడ్ న్యూస్ ప్రకటించిన రష్మికా మందన్న.. చాలా ప్రత్యేకమైనది రాబోతోందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించి ఎంత చెప్పినా తక్కువే.

గుడ్ న్యూస్ ప్రకటించిన రష్మికా మందన్న.. చాలా ప్రత్యేకమైనది రాబోతోందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఈ భామ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. ఇక ఇటీవల రష్మిక నటించిన యానిమల్(Animal), ఛావా, పుష్ప, పుష్ప-2(pushpa) వంటి సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఘన విజయం సాధించడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. ఈ అమ్మడు చివరిగా నటించిన ‘సికందర్’మాత్రం భారీ డిజాస్టర్‌ అయింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తున్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజాగా, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ రోజు కొత్త కొత్తగా ఒకటి ప్రారంభించాను. దానిని రివీల్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నా. మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు, మీ చేతులు వణుకుతున్నప్పుడు, మీ బుగ్గలు నవ్వుతూ నొప్పిగా ఉన్నప్పుడు మీకు ఆ అనుభూతి తెలుసా?? అవును... ఇప్పుడు నేను అదే ఫీల్‌లో ఉన్నాను. ఎందుకంటే చాలా చాలా ప్రత్యేకమైనది రాబోతోంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు త్వరలో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసిపోతున్నారు.. రిలేషన్‌షిప్ గురించి కన్ఫార్మ్ చేస్తారు కావచ్చని భావిస్తున్నారు.

Next Story