- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌తో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రష్మిక.. రింగ్ చాలా ఇంపార్టెంట్ అంటూ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend)మూవీతో రాబోతుంది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend)మూవీతో రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన ఆమె.. తాజాగా, జగపతి బాబు(Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో పాల్గొంది. ఈ షోలో భాగంగా విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరగడంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జగపతి బాబు.. రష్మికకు గాలి పిల్ల అనే నిక్‌నేమ్ పెట్టానని అంటాడు. దానికి రష్మిక నవ్వుతూ.. అయ్యయ్యో సార్ అంటుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్రెండ్, విజయ్‌కి ఆల్‌టైమ్ ఫ్యాన్. మరి విజయం విజయ్ అంతా నీకే సొంతమా అనగా.. ఏమో అని అంటుంది.
ఇక ఆమె పెట్టుకున్న రింగులు చాలా ఇంపార్టెంట్‌హా అని అడగ్గా.. అవును ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడంతో అంతా గోల గోల చేస్తారు. వాటిలో ఇకటి చాలా ఫేవరెట్ రింగ్, దానికి ఓ హిస్టరీ ఉందట కదా? అని అంటాడు. ఇక రష్మిక సిగ్గు పడుతూ కనిపిస్తుంది. నాకు వాళ్ల రియాక్షన్ చాలా ఇష్టం. నేను దానిని ఎంజాయ్ చేస్తున్నా’’ అని చెప్పింది. ఇక చివర్లో ఎంగేజ్‌మెంట్ రింగ్ షాట్ ప్రోమోలో హైలెట్‌గా మారింది. ఈ షో ప్రోమో చూసిన వారంతా విజయ్‌తో ఎంగేజ్‌మెంట్ నిజమేనని కంగ్రాట్స్ చెబుతున్నారు.






