Rashmi: యాంకర్ రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలంటూ.. నెటిజన్ల రియాక్షన్

by Disha Web Desk 10 |
Rashmi: యాంకర్ రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలంటూ.. నెటిజన్ల రియాక్షన్
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ.. యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంటర్ టైన్ మెంట్ షోలతో మస్తు పాపులర్ అయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈమె జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలు, సమాచారం కనిపిస్తే చాలు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపిన ఘటన అందరినీ కలచివేసింది. ఇక ఈ ఘటనపై రష్మీ స్పందిస్తూ.. ‘కుక్కలు కూడా మనలాగే ప్రాణులు.. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలి’ ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్క‌తో పోల్చి “ఈ కుక్క.. రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రష్మి కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. “తప్పకుండా.. నీ అడ్రస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో చూస్తా. నీకు ఇదే నా ఛాలెంజ్” అంటూ సవాల్ విసిరింది.

Next Story

Most Viewed