బిగ్‌బాస్ 16 విన్నర్‌‌ ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
బిగ్‌బాస్ 16 విన్నర్‌‌ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: రియాలిటీ టీవీ షో 'బిగ్‌బాస్' తెలుగులో మాత్రమే కాకుండా పలు బాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే ఈ షోకు హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, బిగ్‌బాస్ 16 ఎపీసోడ్ ఆదివారం రాత్రి ఉత్కంఠగా సాగింది. ఇందులో విన్నర్‌గా రాపర్ ఎంసీ స్టాన్‌ నిలిచాడు. అతనికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు కారు రూ. 31.8 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్ ఎపిసోడ్‌లో ప్రియాంక చాహర్ చౌదరి, షాలిన్ భానోట్, అర్చన గౌతమ్, శివ్ థాకరే ఎంసీ స్టాన్ ఐదుగురు పోటీదారులు ట్రోఫీ కోసం పోటీపడ్డారు.

అయితే ఇందులో ఎంసీ స్టాన్ షోలో ఫస్ట్-రన్నర్‌గా నిలిచిన శివ్ ఠాకరేను ఓడించి విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ 16 ట్రోఫీని తీసుకునేటప్పుడు ఎంసీ స్టాన్ ఎమోషనల్ అయ్యాడు. హౌస్‌లో ఎంసీ స్టాన్ ఆటపై సల్మాన్ ఖాన్ స్టేజ్‌పై ప్రశంసలు కురిపించాడు. రాపర్ ఎంసీ స్టాన్ బిగ్ బాస్ 16 ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తన నిజమైన వ్యక్తిత్వంతో చాలా మంది హృదయాలను గెలుచుకున్నానని తెలిపాడు. అతను శివ్ థాకరే, సాజిద్ ఖాన్, నిమ్రిత్ కౌర్ అహ్లువాలియా, అబ్దు రోజిక్, సుంబుల్ తౌకీర్ ఖాన్‌లతో గొప్ప స్నేహ బంధం ఉందని తెలియజేశాడు.

Next Story

Most Viewed