- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ రన్‌టైమ్‌తో థియేటర్స్‌లోకి రాబోతున్న రణ్‌వీర్ సింగ్ సినిమా..
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), సారా అర్జున్ (Sara Arjun)కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar).

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), సారా అర్జున్ (Sara Arjun)కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar). మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజమైన సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేశాయి. షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమా రన్‌టైన్ 3గంటల 32నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్నట్లు సమాచారం. ‘ధురంధర’పాన్ ఇండియా లాంగెస్ట్ రన్‌టైమ్ మూవీస్ లిస్ట్‌లోకి చేరనుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఆర్ఆర్ఆర్, పుష్ప-2, కల్కి, బాహుబలి ఎపిక్ లాంటి సినిమాలు ఎక్కువ రన్‌టైమ్‌తో వచ్చాయి. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ కూడా ఆ రూట్లో అడుగు వేస్తోందని తెలుస్తోంది. అదే రేంజ్‌లో హిట్ అందుకుంటుందని మూవీ మేకర్స్ అంటున్నారు.
మొత్తానికి ‘ధురంధర’ అత్యధిక రన్‌టైమ్‌తో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కొందరు వామ్మో అంత రన్‌టైమ్ ఉంటే.. చాలా బోర్‌గా ఫీల్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. కాగా.. రణ్‌వీర్, సారా మధ్య ఏకంగా 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి రణ్‌వీర్‌పై విమర్శలు చేస్తున్నారు. కూతురి లాంటి అమ్మాయితో రొమాన్స్ చేయడం ఏంటని అంతా తిడుతున్నారు.






