- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా నుంచి డబుల్ ధమాకా.. మేకర్స్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) గత ఏడాది ‘సింగం అగైన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) గత ఏడాది ‘సింగం అగైన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ (Dhurandhar)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ (Aditya Dhar)దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఒక మామూలు మనిషి క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.
ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ సినీ ప్రియుల్లో జోష్ పెంచుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, చిత్రబృందం ‘ధురంధర్’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నవంబర్ 12న రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రణ్‌వీర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






