- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణ్‌వీర్ సింగ్ అందరి ముందు నా కాళ్ళు పట్టుకున్నాడు.. వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్రి హోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులారీటిని తెచ్చుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్రి హోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులారీటిని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా నిత్యం పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనుచిత కామెంట్స్ చేశారు. రాత్రంతా తాగి పొద్దున్నే దేవుడిని అంటే ఎవరూ నమ్మరు. జనాలు పిచ్చోళ్ళు కాదు అందరినీ దేవుడిగా అంగీకరించరు అన్నారు. తాజాగా, మరో స్టార్ హీరోపై వివేక్ అగ్నిహోత్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
‘‘రణ్‌వీర్ సింగ్ ఓ అవార్డు కార్యక్రమంలో అందరి ముందు నా కాళ్ళు పట్టుకున్నాడు. రణ్‌వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ పై విమర్శలు వెల్లువెత్తగా నేను మాత్రం సమర్ధించాను. అందుకు కృతజ్ఞతగా రణ్‌వీర్ సింగ్ నా పాదాలు తాకాడు. నేను యంగ్ ఫిల్మ్ మేకర్స్ ని ప్రోత్సహించాను. యూత్ ధైర్య సాహసాలతో ఉండాలి’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






