- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి తొలి పాట వచ్చేసింది...
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌లో వస్తున్న ఆరో చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. ..

X
దిశ, సినిమా: బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌లో వస్తున్న ఆరో చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. చైతన్య రావు, లావణ్య జంటగా నటిస్తోన్న సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్‌ను ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ‘కంటిచూపు నిన్నే దాటి పోనంటోందమ్మా’ అంటూ శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను ప్రిన్స్ హెన్రీ సంగీతంలో ఎస్పీ చరణ్ అద్భుతంగా ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మూవీ టీమ్.. అన్నపూర్ణ ఫొటో స్టూడియోలో మంచి ఫొటోలే కాదు, మంచి సినిమాలు కూడా తీయబడతాయన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఘన విజయం చేయాలని కోరారు. చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న సినిమాకు యష్ రంగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘దరువెయ్యరా’.. ‘రామబాణం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
Next Story






