- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యానిమల్’ సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్ లీక్ చేసిన రణ్‌బీర్ కపూర్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘యానిమల్ పార్క్’ (Animal Park)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘యానిమల్ పార్క్’ (Animal Park)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘యానిమల్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, అభిమానులతో చిట్‌చాట్ చేసిన రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘యానిమల్ పార్క్ సినిమా గురించి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. 2027లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రస్తుతం సంగీతం గురించి, పాత్రల గురించి సందీప్ రెడ్డి వంగాతో చర్చిస్తున్నాను. ఈ మూవీ సెట్స్‌లో ఉండటానికి వేచి ఉండలేను’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.






