Ranbir Kapoor: ఏ గుడి కనిపించినా అదే పని చేసేవాడు.. తండ్రి ప్రవర్తనపై రణ్ బీర్

by Disha Web Desk 10 |
Ranbir Kapoor: ఏ గుడి కనిపించినా అదే పని చేసేవాడు.. తండ్రి ప్రవర్తనపై రణ్ బీర్
X

దిశ, సినిమా: దివంగత నటుడు, తన తండ్రి రిషి కపూర్ జీవనవిధానం గురించి రణబీర్ కపూర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తను చూసిన మనుషుల్లో తన తండ్రి అత్యంత పవిత్రమైన భక్తిపరుడని, మతపరమైన పద్ధతులన్నీ ఎక్కడికెళ్లినా క్రమం తప్పకుండా పాటించేవాడని తెలిపాడు. అలాగే ఏ ప్రాంతంలో ఉన్నా రోజుకు రెండుసార్లు ప్రార్థనలు చేసేవాడని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఏదైనా చిన్న మందిరం కనిపిస్తే చాలు ‘జై’ అంటూ నినదించేవాడని గుర్తు చేసుకున్నాడు. చివరగా ‘ఇలాంటి భావాలన్నీ నాతోపాటు మీలో చిన్ననాటి నుంచి నాటబడ్డాయి. కాబట్టి మీరు ఈ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లండి’ అంటూ రణబీర్ తన అభిమానులకు సూచించాడు.

ఇవి కూడా చదవండి: Shaakuntalam : ‘శాకుంతలం’ సినిమాపై అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్..

Next Story

Most Viewed