Ranga Marthanda: ఈ సినిమా ఎవరూ చూడరనుకున్నా.. కానీ కృష్ణ ఏడిపించేశాడు!

by Disha Web Desk 10 |
Ranga Marthanda: ఈ సినిమా ఎవరూ చూడరనుకున్నా.. కానీ కృష్ణ ఏడిపించేశాడు!
X

దిశ, సినిమా: సీనియర్ నటి రమ్యకృష్ణ ‘రంగమార్తాండ’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త, దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ సరసన నటించింది రమ్య. అయితే మార్చి 22న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా తీస్తున్నపుడే ఎవరు చూస్తారని కృష్ణను అడిగాను. ఎందుకంటే ఇదే కథతో వచ్చిన మరాఠి మూవీ ‘నటసామ్రాజ్’ చూశాను. కథలో బలమైన సబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఈ తరం ఇష్టపడరేమోనని చెప్పాను. అయినా నా మాటలు పట్టించుకోకుండా చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఇందులో మెయిన్ రోల్ కోసం పలువురు హీరోయిన్లను అడిగితే ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో నేను చేస్తానని ముందుకొచ్చా. ఇందులో కళ్లతోనే నటించాలన్నాడు. నిజానికి నేను ఎమోషనల్ చిత్రాలను చూడకపోయినా ఇందులో పూర్తిగా భావోద్వేగంతో కూడిన పాత్ర చేశాను’ అని తెలిపింది.

Also Read: Ranga Marthanda: ఆకట్టుకుంటున్న ‘రంగమార్తాండ’ ఎమోషనల్ ట్రైలర్!



Next Story

Most Viewed