- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో.. ఆ పాటకు డ్యాన్స్ చేసిన రమ్యకృష్ణ..
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది రమ్యకృష్ణ. దాదాపు అగ్ర హీరోలందరితో సినిమా చేసి, గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకుంది.

దిశ,సినిమా: ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది రమ్యకృష్ణ. దాదాపు అగ్ర హీరోలందరితో సినిమా చేసి, గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికీ తగ్గేదెలే అంటూ సెకండ్ న్నింగ్స్‌లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తోంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు 'డ్యాన్స్ ఐకాన్' షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది రమ్యకృష్ణ. రిసేంట్‌గా ఈ డాన్స్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్స్ 'నా అల్లుడు' సినిమాలోని 'సయ్యా సయ్యారే' అనే పాటకు డ్యాన్స్ చేశారు. కాగా ఈ పాట తాలూకు జ్ఞాపకాలు షోలో పంచుకుంది రమ్యకృష్ణ. ఈ పాటకు ఒరిజినల్‌గా ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేస్తున్నప్పుడు.. తను నాలుగు నెలల గర్భవతినని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఆమె అంకితభావానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆరుగురిపై లైంగిక దాడి చేసిన డైరెక్టర్.. సపోర్ట్‌గా నిలిచిన నటి






