- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ram Pothineni: పక్కోడి.. పకోడీలు పట్టించుకుంటే పనులు జరగవు: రామ్ పోతినేని
దిశ, సినిమా: రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించనున్నాడు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా.. ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ పోతినేని స్పీచ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
‘ఇటీవల నేను సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ చూస్తున్నాను. ‘అరే నీకు ఇది నచ్చిందా’ అంటే.. వాళ్లకి నచ్చుతుంది ఏమో? ఇంకొకరికి నచ్చుతుంది ఏమో?' అని పక్కన ఉన్న వారివైపు చూస్తున్నారు. ముందు మనకి నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం తిన్న బిర్యానీ నచ్చిందంటే.. చుట్టుపక్కల ఉన్న నలుగురు బాలేదని అంటే మన మీద మనకి డౌట్ రాకూడదు. 'నేను తిన్నాను. బావుంది' అని చెప్పాలి. అది బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరీర్ అయినా! నీకు నచ్చింది నువ్వు చెయ్. పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్.