- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం.. అప్పటినుంచే మొదలైందంటూ క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)ప్రేమించుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

దిశ, సినిమా: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)ప్రేమించుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు పుకార్లు వస్తున్నాయి. అలాగే వీరిద్దరు ఓ చోటుకు కలిసి వెళ్లడంతో ఈ రిలేషన్‌షిప్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం కూడా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, రామ్ పోతినేని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను మా సినిమా కోసం ఓ పాట నాశాను. అప్పటినుంచి భాగ్యశ్రీతో రిలేషన్‌షిప్ ఉన్నాననే వార్తలు మొదలయ్యాయి.
మనసులో ఏమి లేకపోతే అంత గొప్పగా ఎలా రాయగలరు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రలను ఊహించుకుని రాశానే. ఈ పాట రాసినప్పుడు అసలు ఆమె నాకు పరిచయమే లేదు’’ అని అన్నారు. దీంతో ఈ ప్రేమ వార్తలకు చెక్ పడినట్లు అయింది. కాగా.. రామ్ పోతినేని, భాగ్యశ్రీ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka). మహేష్ బాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించారు. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి రాబోతుంది.






