తల్లి కాబోతున్న రామ్ చరణ్ బ్యూటీ.. బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) హిందీలో ఎన్ని సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

తల్లి కాబోతున్న రామ్ చరణ్ బ్యూటీ.. బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) హిందీలో ఎన్ని సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘భరత్ అనే నేను’చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి మూవీనే సూపర్ స్టార్ సరసన చేయడంతో అమ్మడుకి మంచి మార్కులే పడ్డాయి. అలా మెగా హీరో రామ్ చరణ్(Ram Charan) సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి మెప్పించింది. ఇక హిందీలోనూ పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ‘లస్ట్ స్టోరీస్’ మరీ బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇక ఇటీవల రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’(Game Changer) మూవీ చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది.

ఇక కియారా పర్సనల్ లైఫ్ విషయాని కొస్తే.. వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)ను ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి అభిమానులను ఆనందపెట్టింది. కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన కియారా రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా, ఆ భామకు గ్లోబల్ స్టార్ సతీమణి ఉపాసన ఓ గిఫ్ట్ పంపించి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

అంతేకాకుండా ఎంతో ప్రేమగా ఓ లెటర్‌ను కూడా రాసి తన ప్రేమను వ్యక్తపరిచింది. అత్తామాస్ కిచెన్ నుంచి పలు పదార్ధాలను కడుపుతో ఉన్న కియారాకు పంపడంతో ఆమె చాలా సంతోష పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఇక ఉపాసన నిత్యం పలువురి సినీ ప్రియులకు ఇలా తన అత్త సురేఖ చేసే వంటలను పంపుతూ అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు మెగా కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story