- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ పుట్టినరోజు నాడు రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్.. అసలు అందులో ఏముందంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)70వ పుట్టినరోజును గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)70వ పుట్టినరోజును గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో.. ఆయనకు విషెస్ తెలుపుతూ అభిమానుల రక్తదానాలు చేస్తుండటంతో పాటు అన్నదానం కార్యక్రమాలు కూడా చేపట్టారు. మరికొందరు అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో.. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన తండ్రి మెగాస్టార్ గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘ఇది నీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న. మీ లాంటి గొప్ప వ్యక్తికి జరుపుతున్న గొప్ప సంబరము.
నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే. నా ప్రతి విజయం, నేను మోసే విలువలు అన్నీ మీ నుంచే వచ్చాయి. 70 ఏళ్ల వయసులో కూడా మీరు మా హృదయంలో యువకుడిగానే ఉండి మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా మరెన్నో సంవత్సరాలు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అలాగే చిరంజీవితో కేక్ కట్ చేయించి హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు. కాళ్లకు నమస్కారం చేసి కేక్ కూడా తినిపించారు.కాగా, రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






