ఆ సినిమా కోసం రామ్ చరణ్ నయా లుక్.. కొత్త భాష కోసం ట్రైనింగ్

by Disha Web Desk 7 |
ఆ సినిమా కోసం రామ్ చరణ్ నయా లుక్.. కొత్త భాష కోసం ట్రైనింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చి బాబు సనాతో ఈ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. రామ్ చరన్ ఈ చిత్రంలో ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. ‘RC16’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నారట. అందుకోసం చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్‌‌ను కూడా చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. బుచ్చిబాబు రంగస్థలం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి చరణ్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

బుచ్చి బాబు,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఏమి చేయబోతున్నాడో తెలుసా?

ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.. ఇప్పటికీ బాధ పడుతున్న: నాగ చైతన్య

Next Story

Most Viewed