'విక్రమ్' సీక్వెల్‌లో చరణ్.. కథలో ఊహించని మలుపు

by GSrikanth |

దిశ, సినిమా : విశ్వ నటుడు కమల్ హాసన్‌ నటించిన ‘విక్రమ్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

విక్రమ్ సీక్వెల్‌లో చరణ్.. కథలో ఊహించని మలుపు
X

దిశ, సినిమా : విశ్వ నటుడు కమల్ హాసన్‌ నటించిన 'విక్రమ్' మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 'విక్రమ్' సీక్వెల్‌ తెరకెక్కిస్తే కమల్ హాసన్‌ను కాపాడుకునే తన మనవడి పాత్రను రామ్ చరణ్ పోషించవచ్చని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో స్టార్ హీరో సూర్య కూడా ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ లోకేష్ ఇప్పటికే చరణ్‌‌కు కథ చెప్పాడని, తాను శంకర్‌తో చేస్తున్న మూవీ కంప్లీట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


Next Story