చెప్పులు లేకుండా రామ్ చరణ్.. నేషనల్ లెవల్ లో వైరల్

by Javid Pasha |   (  Updated:2023-02-21 10:40:06  IST  )

హీరో రామ్ చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా కనిపించారు.

చెప్పులు లేకుండా రామ్ చరణ్.. నేషనల్ లెవల్ లో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: RRR మూవీతో హీరో రామ్ చరణ్ ఒక్కసారిగా పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హీరో రామ్ చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా కనిపించారు. చెప్పులు లేకుండా ఎయిర్ పోర్టులో నడుస్తున్న ఆయన ఫోటోలు ప్రస్తుతం నేషనల్ లెవల్ లో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ నటించిన RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరిలో ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వచ్చే నెల 12న ఆస్కార్ అవార్డ్ ఉత్సవాలు జరగనున్నాయి.


ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హీరో రామ్ చరణ్ మంగళవారం లాస్ ఏంజెల్స్ బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయన చెప్పులు లేకుండా కనిపించగా.. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆయన చెప్పులు లేకుండా కనిపించడానికి గల కారణం ఆయన అయ్యప్ప స్వామి భక్తుడు కావడమే. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అందువల్లే ఆయన చెప్పులు లేకుండా కనిపించారు.

Next Story