రామ్ చరణ్ ప్రేమ కోసం ఆ త్యాగం చేసిన ఉపాసన

by Disha Web Desk 7 |
రామ్ చరణ్ ప్రేమ కోసం ఆ త్యాగం చేసిన ఉపాసన
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఉపాసన, రామ్ చరణ్ జోడి ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 11 సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇక తాజాగా ఈ దంపతులకు ఓ చిన్నారి జన్మించగా ప్రస్తుతం తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ సంతోషంగా ఉంది ఉపాసన. అయితే తాజాగా ఉపాసనకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఉపాసన తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలే అనే విషయం మనకు తెలిసిందే.

వీరికి మగ సంతానం లేకపోవడంతో ఉపాసన తండ్రి తన ఆడపిల్లలనే మగ పిల్లల లాగా పెంచాడు. అదే ధైర్యంతో ఉపాసన తన సోదరి కూడా పెద్ద ఎత్తున బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ సాధించారు. అయితే తన తల్లిదండ్రులకు పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లనని చాలా గట్టిగా చెప్పేసిందట ఉపాసన. కానీ తన తల్లి శోభ.. ఉపాసనను కూర్చోబెట్టుకొని పెళ్లి, జీవితం గురించి వివరించిందట. దీంతో చరణ్ ప్రేమ కోసం తన పంతాన్ని పక్కన పెట్టి అత్తారింటికి వెళ్లిందట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed