Ram Charan : చిరంజీవి 16 ఏళ్ల కలను నిజం చేసిన రామ్ చరణ్

by Disha Web Desk 10 |
Ram Charan
X

దిశ, సినిమా: మెగాస్టార్ వారసుడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. నటనలో తండ్రిని మించిపోయాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిచుకుని పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక ఇదంతా పక్కన పెడితే 16 సంవత్సరాల క్రితం వజ్రోత్సవం వేడుకల్లో స్టేజ్ పై మాట్లాడుతూ చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఏ ఒక్క తెలుగు నటుడి ఫోటో కూడా రాకపోవడం చాలా బాధగా అనిపించింది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి ఎంతో మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. కానీ వారి ఫోటోలు కూడా గోవా ఫిలిం ఫెస్టివల్లో కనిపించడం లేదు. మన తెలుగుజాతికి గౌరవం లభించడం లేదు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక తాజా సమాచారం ప్రకారం తండ్రి చిరంజీవి 16 ఏళ్ల కలను నిజం చేశాడు రామ్ చరణ్. గోవా ఫిలిం ఫెస్టివల్ లో చెర్రీ ఫోటో కనిపించింది. చిరు ఏ విషయంలో అయితే బాధపడ్డాడో దాన్ని ఫుల్ ఫిల్ చేసి చూపించాడు చరణ్. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మాటలను కొడుకు నిజం చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed