- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోషన్ కనకాల ‘మోగ్లీ’ మూవీ కోసం రంగంలోకి రామ్ చరణ్.. మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారుగా!
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli).

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli). ఈ సినిమాకు కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో రోషన్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పా్న్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ‘మోగ్లీ’త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమా వరల్డ్ ఎలా ఉంటుందో ఒక వీడియోను క్రియేట్ చేశారు.
ఈ వీడియో కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను రంగంలోకి దింపారు. ఆగస్టు 29న సాయంత్రం 4:05 గంటలకు ఈ గ్లింప్స్ వీడియోను రామ్ చరణ్(Ram Charan) రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం ఓ పోస్ట్ పెట్టింది. ఇక వారు షేర్ చేసిన వీడియోలో రామ్ చరణ్ ‘మోగ్లీ’కి సంబంధించిన వీడియో చూపించగానే ఫిదా అయిపోయారు. అంతేకాకుండా చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. దీంతో సందీప్ రాజ్ ఓ డైలాగ్ కూడా చెప్నారు. ప్రతిసారి గుర్రాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే మీరు గుర్పోస్తారో అని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు సందీప్ రాజ్ గట్టిగానే ప్లాన్ చేశాడని అంటున్నారు.






