బరిలోకి దిగితే రికార్డులు బద్దలే... యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ చరణ్

by Mallepaka Hamsa |

‘రై రై రారా’ మొదటి పాటకు మించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

బరిలోకి దిగితే రికార్డులు బద్దలే... యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ చరణ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఈ మూవీ నుంచి విడుదలవుతున్న పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, యూట్యూబ్‌లో దుమ్మురేపింది. తాజాగా విడుదలైన రెండో పాట ‘రై రై రారా’ అంతకు మించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సాంగ్ ఇప్పటికే 31 మిలియన్లకు పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా వ్యూస్ (రియల్ టైమ్) మరియు 30 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, బుచ్చిబాబు సనా ఎంతో పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ పాటల్లోని బీట్, చరణ్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ‘పెద్ది’ లో చరణ్ ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక పాటలే ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుంటే, సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story