‘పెద్ది’ డబ్బింగ్ షురూ చేసిన రామ్ చరణ్..

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-01 14:31:32  IST  )

ఇక ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించారు.

‘పెద్ది’  డబ్బింగ్ షురూ చేసిన రామ్ చరణ్..
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’(peddi) సినిమా వేసవిలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్లెవల్‌కి చేరుకుంది. బుచ్చి బాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్ చెప్పిన ‘ఏమది’ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్-విజేత స్వరకర్త AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story