- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా బిడ్డకు జపాన్‌తో సంబంధం ఉంది.. ఉపాసన ప్రెగ్నెన్సీపై చెర్రీ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట పిల్లల విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఉపాసన ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు, మెగా అభిమానులు కూడా పండుగ చేసుకున్నారు. ఇక తాజాగా.. శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్‌లో అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ పుట్టబోయే తన బిడ్డపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘యూరప్ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు జపాన్ ఇష్టమైన దేశంగా మారింది. అక్కడి సంస్కృతి, ప్రజలంటే ఇష్టం. ప్రస్తుతం నా భార్యకు ఏడో నెల ప్రెగ్నెన్సీ. అంతే కాదు మా బిడ్డకు జపాన్‌తో సంబంధం ఉంది. ఎందుకంటే జపాన్‌లోనే ఈ మ్యాజిక్ జరిగింది’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
Next Story






