- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ టాపిక్‌గా మారిన భాగ్యశ్రీ పోస్ట్.. పెళ్లి డేట్ అనౌన్స్ చేయాలంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka). మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర కీలక నటించారు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్స్‌లోకి వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంనుంచే రామ్, భాగ్రశ్రీ బోర్సే ప్రేమలో మునిగితేలుతున్నారని పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే రామ్ పోతినేని నువ్వుంటే చాలు అనే పాటను రాశారు. దీంతో ఆమెను ఊహించుకునే రాసాడనే ప్రచారం జరిగింది.
ఈ విషయంపై రామ్ స్పందించి ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని అన్నాడు. ను ఈ సినిమాలో రాసిన పాట టైమ్‌కు హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు. అమ్మాయి ఎవరో తెలియదప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి రాయలేదని రూమర్స్‌కి చెక్ పెట్టాడు. ఈనేపథ్యంలో.. తాజాగా, భాగ్యశ్రీ బోర్సే ఓ వీడియో షేర్ చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ థియేటర్లలో సందడి చేస్తుంటే మరోవైపు రామ్, భాగ్యశ్రీ యూఎస్ ట్రిప్ వేశారు. అమెరికాలో ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోను భాగ్యశ్రీ షేర్ చేయగా ఆ వీడియోతో మళ్లీ ప్రేమ వార్తలు జోరందుకున్నాయి.
ఇక ఇందులో హీరోయిన్ వీడియో తీస్తుండగా.. రామ్ కూలింగ్ గ్లాసెస్ ధరించి స్లైటీష్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంకెన్నాళ్లు దాస్తారు.. రామ్ పెళ్లి కార్డు పంపించు పప్పన్నం తినేసి వెళ్తాం అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రామ్ కెరీర్‌లో మళ్లీ జోష్ తెచ్చిన సినిమా అవుతుండగా అతని వ్యక్తిగత జీవితం చుట్టూ తిరిగే రూమర్స్ కూడా ఇదే రేంజ్‌లో హంగామా చేస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ నిజమో కాదో తెలియనప్పటికీ వీడియో మాత్రం నెట్టింట సంచలనం సృష్టిస్తూ.. నెటిజన్లకు లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తోంది.






