మా సినిమా చూసి సిగ్గుపడకండి.. 'డాక్టర్ జి'పై రకుల్

by Disha Web Desk 7 |
మా సినిమా చూసి సిగ్గుపడకండి.. డాక్టర్ జిపై రకుల్
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డాక్టర్ జి'. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో క్యారెక్టర్ గురించి రీసెంట్ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. ''డాక్టర్ జి' సినిమా చాలా ప్రత్యేకమైన కాన్సెప్ట్. దర్శకుడు కథ చెప్పిన విధానమే నన్ను ఈ సినిమా చేసేలా ఆకర్షించింది. సున్నితమైన అంశాలతో కూడిన చిత్రాన్ని పేరెంట్స్‌తో కలిసి చూడొచ్చు. మేము మాట్లాడిన సంభాషణల గురించి సిగ్గుపడకండి. మేము ఎక్కడ బోధించడానికి ప్రయత్నించలేదు. ఇది పూర్తిగా వినోదభరితమైన కుటుంబ చిత్రం. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆయుష్మాన్ లాంటి కష్టపడి పనిచేసే నటుడితో వర్క్ చేయడం ఆనందంగా ఉందన్న ఆమె.. కరోనాకు ముందు సంతకం చేసిన సినిమా గురించి చాలాసార్లు చర్చలు జరిగాయని, ఎట్టకేలకు జనాలకు వినోదం అందించేందుకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.



Next Story

Most Viewed