ఆయన కమిట్‌మెంట్‌కు ఫిదా అయ్యా : Rakul Preet Singh

by Chukka Sudharani |   (  Updated:2022-08-27 12:18:24  IST  )

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రమశిక్షణకు ఫిదా అయ్యానంటోంది.

ఆయన కమిట్‌మెంట్‌కు ఫిదా అయ్యా : Rakul Preet Singh
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రమశిక్షణకు ఫిదా అయ్యానంటోంది. వీరిద్దరూ జంటగా నటించిన 'కట్‌పుట్లీ' మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 2న విడుదల కాబోతుంది. ఈ మేరకు వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. సెట్స్‌లో నుంచి కొన్ని అనుభవాలను పంచుకుంది. 'నేను అక్షయ్ సార్‌కు పెద్ద అభిమానిని.. ఇంతకుముందు అతని క్రమశిక్షణ గురించి విన్నాను. కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూశాను. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నచ్చాయి. పనిపట్ల ఆయనకుండే అంకిత భావం ఎంతో శక్తివంతమైనది. అది అందరిని ఒకేతాటిపై నడిపిస్తూ ఉత్తేజపరుస్తుంది. నిజంగా ఆయనతో పనిచేయడం ఒక అద్భుత అవకాశం' అంటూ పొగిడేసింది. రంజిత్ ఎం. తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మారొద్దు

Next Story